Wednesday, June 11, 2014




Rescue operations in Beas River. Photo Courtesy-Indian Express

హిమాచల్ ప్రమాదం –కారణాలు-విశ్లేషణ
హిమాచల్ ప్రదేశ్  లో June 9న బియాస్ నదిలో  జరిగిన ఘటన అత్యంత దారుణం , శోచనీయం . అప్పటి వరకు కేరింతలు ఆట పాటలతో  సరదాగా గడుపుతున్న V.N.R. Vigyanajyothi Engineering College,Bachupally,Hyderabad కి చెందిన 24 మంది యువతీ-యువకులు ,వారు ఏ నదీ ప్రవాహన్నైతే ఫోటో తీసి  మరుపు రాని మధుర స్మృతిగా మార్చుకున్దాము అనుకున్నారో ,అదే ప్రవాహం వారిని ముంచి విషాద ఛాయలు మిగిల్చింది .ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంచి భవిష్యత్తు ఉన్న యువతి-యువకులు తిరుగురాని లోకాలకి వెళ్ళిపోయారు.ఇక వారి తల్లి-తండ్రుల పరిస్థిది చెప్పనఖ్ఖర్లేదు,ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు ,ఇంకా మిగిలిన వారి గురించి గాలింపు చేపడుతున్నారు.ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లల తల్లి-తండ్రుల బాధ వారికే తెలుస్తుంది ,ఆ బాధ వర్ణనాతీతం,ఎవ్వరు ఎంత ఓదార్చిన ,ప్రభుత్వం ఎంత సహాయం చేసినా  వారి నష్టం పూడ్చలేనిది.మనం చేయగలిగేది కేవలం దేవుడు వారికి ఈ విపత్కర పరిణామాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని ప్రార్ధించడం మాత్రమే.